Breaking News
Home / States / అక్కడి ఎన్నికల సందర్భంగా తెలంగాణలోనూ…

అక్కడి ఎన్నికల సందర్భంగా తెలంగాణలోనూ…

హైదరాబాద్‌: మహారాష్ట్రలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి తెలిపారు. ఈ నెల 21న జరిగే ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఈవోలు, ఎక్సైజ్, ఆదాయపన్ను అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా ఇతర ఎన్నికల కమిషన్‌ అధికారులు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి సోమేష్‌కుమార్‌, సీఈవో రజత్‌కుమార్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, అడిషనల్‌ డీజీ జితేందర్‌తోపాటు ఐటి అధికారులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా సీఎస్‌ జోషి మాట్లాడుతూ మహారాష్ట్రలోని గడ్చిరోలి, నాందేడ్‌, చంద్రాపూర్‌, యావత్‌మాల్‌ జిల్లాలతో సరిహద్దు ఉందని, తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలల్లో 14 చెక్‌పోస్టులు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్ర అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సమన్వయంతో పనిచేస్తామన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందు, కౌంటింగ్‌ రోజున ఉదయం 6గంటల నుంచి కౌంటింగ్‌ ముగిసే వరకూ డ్రై డే అమలుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నామని, ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించామన్నారు. తెలంగాణ నుంచి 1800 మంది హోంగార్డ్స్‌ ను విధులకు పంపామని, చెక్‌పోస్టులలో సీసీటివిలు ఏర్పాటు చేశామని తెలిపారు. సీఈవో రజత్‌ కుమార్‌ మాట్లాడుతూ పరిస్థితులన్నీకంట్రోల్‌లో ఉన్నాయని, అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *