హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం మంగళవారం సాయంత్రం సమావేశం కానుంది. ప్రగతిభవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. నూతన రెవెన్యూచట్టం అంశంపై రేపటి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీనికి సంబంధించి రెవెన్యూశాఖ అధికారులు ఇప్పటికే తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.మరోవైపు నూతన సచివాలయ నిర్మాణం అంశంపైనా చర్చించే అవకాశముంది.
