Breaking News
Home / States / Andhra Pradesh / కేసీఆర్‌ సీఎం కావాలని నాలుకను కోసుకుని….

కేసీఆర్‌ సీఎం కావాలని నాలుకను కోసుకుని….

బంజారాహిల్స్‌/హైదరాబాద్‌: అతడు ఆంధ్రా యువకుడు. సీఎం కేసీఆర్‌ అంటే ప్రాణమిచ్చేంత అభిమానం. ఆయన మళ్లీ ఎలాగైనా సీఎం కావాలని బలంగా కోరుకున్నాడు. ఇందుకోసం ఏకంగా తన నాలుకను కోసుకుని ముడుపుగా చెల్లించాడు. బంజారాహిల్స్‌లోని శ్రీనగర్‌కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గుడిలకు చెందిన చేవెళ్ల మహేశ్‌ మంగళవారం హైదరాబాద్‌కు వచ్చాడు. బుధవారం శ్రీనగర్‌ కాలనీలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత హనుమాన్‌ దేవాలయానికి వెళ్లాడు. బ్లేడుతో నాలుక కోసుకుని ముడుపుగా హుండీలో వేశాడు. ఇది గమనించిన ఆలయ సిబ్బంది మహేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలని, కేసీఆర్‌ సీఎం కావాలని మొక్కు చెల్లించుకున్నట్లు మహేశ్‌ వద్ద లేఖ లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్నట్లు లేఖలో ఉందని చెప్పారు. వైఎస్‌ఆర్‌ సీఎం కావాలని గతంలోనూ ఇలాగే నాలుక కోసుకున్నట్లు తెలిపారు.

Check Also

మాదాపూర్‌ లేడీస్ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య

Share this on WhatsAppహైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *