Breaking News
Home / States / మహిళల రక్షణకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టాలి….

మహిళల రక్షణకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టాలి….

హైదరాబాద్: దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. తెలంగాణ సమాజం ఎన్నో ఎన్‌కౌంటర్లకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిందని, ఎంతోమంది విప్లవ కారులు ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతిసారీ అవి బూటకమేనని తేలిందని అన్నారు. కానీ తాజా ఎన్‌కౌంటర్ మాత్రం సరైనదేనని అనిపిస్తోందని తెలిపారు. నిజానిజాలు ఎలా ఉన్నా ఈ చర్యను అభినందిస్తున్నానని, ఒక మహిళగా పోలీసులను, సీఎంను సమర్థిస్తున్నానని చెప్పారు. మహిళల రక్షణనకు సర్కార్ చర్యలు చేపడితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *