తిరుమల: తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చిన తమిళిసైకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం తమిళిసైకి రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలతో పాటు స్వామివారి చిత్ర పటాన్ని అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు తెలిపారు.
