Breaking News
Home / States / అవి సాధించే వరకు సమ్మె విరమించొద్దు…

అవి సాధించే వరకు సమ్మె విరమించొద్దు…

వరంగల్: తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్లే నష్టాల్లో ఉందని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కోసమే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె విరమించొద్దని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ల సాధనకు కార్మికులు మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *