హైదరాబాద్: జూబ్లిహిల్స్ లోని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ నుంచి రోజూ వేలాది మంది భక్తులు తిరుమలేశుడి దర్శనం కోసం వస్తుంటారని, ఇక్కడి భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం, సముచిత ప్రాధన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
