హైదరాబాద్: తెలంగాణ సచివాలయం తరలింపు నేపథ్యంలో కార్యాలయంలోకి రాకపోకలను నిలిపివేశారు. ఇప్పటికే కొన్ని శాఖల దస్త్రాలు, ఫర్నిచర్‌ను బీఆర్ర్కే భవనానికి తలించగా.. ఈ ప్రక్రియ రాత్రి కూడా కొనసాగింది. ఇవాళ్టి ఉదయం నుంచి ఎవరినీ సచివాలయంలోకి అనుమతించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు, ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి మాత్రమే అనుమతిచ్చింది.
