Breaking News
Home / States / 19న తెలంగాణ రాష్ట్ర బంద్…

19న తెలంగాణ రాష్ట్ర బంద్…

హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె తీవ్రరూపు దాల్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు పట్టు వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న ర్యాలీలు,  18న బైక్ ర్యాలీలు చేపట్టాలని నిశ్చయించారు. అంతేకాకుండా, ఈ నెల 19న తెలంగాణ బంద్ కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *