Breaking News
Home / Crime / నాబిడ్డకు కూడా తెలంగాణ తరహాలో న్యాయం చేయండి

నాబిడ్డకు కూడా తెలంగాణ తరహాలో న్యాయం చేయండి

హర్యానా: తెలంగాణలో దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా పలు బాధిత కుటుంబాలు కూడా నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అభం శుభం తెలియని తన ఏడేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన వారిని తెలంగాణ తరహాలో ఎన్‌కౌంటర్ చేసి శిక్షించాలని బాధితురాలి తండ్రి మంగళవారం డిమాండ్ చేశారు. అత్యాచారం చేసిన వారికి వివిధ దేశాల్లో వివిధ రకాల శిక్షలు అమలులో ఉన్నాయని, మన దేశంలో కూడా అత్యాచార నిందితులను అత్యంత కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు చేయాలని ఆయన కోరారు. తన బిడ్డకు పట్టిన దుర్గతి మరే చిన్నారికి, మహిళకు పట్టకూడదని, అందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది మే 31న చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు అత్యాచారం చేయడమే కాకుండా విచక్షణారహితంగా బ్లేడ్‌తో దాడి చేసి అంతమొందించేందుకు కూడా యత్నించాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారిని కాపాడేందుకు వైద్యులు అనేక శస్త్ర చికిత్సలు చేయాల్సివచ్చింది. అప్పటినుంచి బాధిత చిన్నారి ఆసుపత్రిలో చికిత్సపొందుతూనే ఉంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *