Breaking News
Home / States / Telangana / తెలంగాణ శాసనసభకు డిసెంబర్ 7న ఎన్నికలు

తెలంగాణ శాసనసభకు డిసెంబర్ 7న ఎన్నికలు

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభకు డిసెంబర్ 7న ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని, 11న కౌంటింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున ఓటర్ల జాబితా ప్రకటనకు సమయం పడుతుందన్నారు. వాస్తవానికి అక్టోబర్ 8వ తేదీనే తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉండగా.. ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ హైకోర్టులో కేసు నడుస్తున్నందున ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ పరిణామంపై రావత్ స్పందిస్తూ అసెంబ్లీ రద్దైన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగా కొత్త ఓటర్ల జాబితాను అక్టోబర్ 12న విడుదల చేస్తామని రావత్ తెలిపారు. అయితే ముందుగా హైకోర్టుకు సమర్పించిన తర్వాతే ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులో ఉందన్నారు.

తెలంగాణలో పోలింగ్ క్రమం ఇలా..
తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119
నామినేషన్లకు చివరి తేదీ: నవంబర్‌ 19
నామినేషన్ల పరిశీలన: నవంబర్‌ 20న
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 22
డిసెంబర్‌ 7న పోలింగ్
డిసెంబర్‌ 11న ఎన్నికల ఫలితాలు

Check Also

‘సుప్రీం తీర్పును తుంగలో తొక్కుతున్న కిషన్‌ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి’

Share this on WhatsAppబీజేపీ ఆఫీస్‌ను ముట్టడించిన మాలమహానాడు హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ యత్నాలకు వత్తాసు పలుకుతూ… మాలల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *