Breaking News
Home / States / హిందీ ప్రచారంలో తెలుగు సాహిత్యం కీలకం- ఉపరాష్ట్రపతి

హిందీ ప్రచారంలో తెలుగు సాహిత్యం కీలకం- ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌: హిందీభాషకు సరైన ప్రచారం, ప్రాధాన్యత పెరగడంలో తెలుగు సాహిత్యం పాత్ర కీలకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. హిందీ ప్రచార్‌ సభ ద్వారా హైదరాబాద్‌ కూడా ముఖ్యమైన పాత్ర పోషించినందు వల్లనే, రాజ్యసభ హిందీసలహాకార్‌ సమితి సమావేశాన్ని తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని అన్నారు. దక్షిణభారత సంస్కృతికి హైదరాబాద్‌ ముఖద్వారం, భిన్నసంస్కృతులు, భాషలకు కేంద్రమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. తెలుగుతోపాటు హిందీ, ఉర్ధూ భాషలకూ ఇక్కడ తగిన గౌరవం ఉందన్నారు. గురువారం నగరంలోని దసపల్లాహోటల్‌లో ఏర్పాటు చేసిన రాజ్యసభ హిందీసలహాకార్‌ సమితి 8వసమావేశాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీయేతర ప్రాంతాల్లో ఈ సమితి సమావేశాలు నిర్వహించాలని గతేడాది సమావేశంలో నిర్ణయించామన్నారు. ఇకపై ఇతర ప్రాంతాల్లోనూ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలకూ సమ ప్రాధాన్యత ఇస్తూనే దేశాన్నిఏక తాటిపై తీసుకొచ్చే హిందీభాషను నేర్చుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఈ భాషను ఎవరిపైనా బలవంతంగా రుద్దే ఆలోచన లేదని, హిందీ నేర్చుకోవాలా? వద్దా? అనేది వ్యక్తిగత విషయమని అన్నారు. అయితే హిందీ నేర్చుకోవడం వవల్ల లాభమే తప్ప నష్టం లేదని ఆయన స్పష్టంచేశారు. హిందీని వ్యతిరేకించడం, దీనిపై అవనసర వివాదాలు సృష్టించే ప్రయత్నం సరికాదని ఉపరాష్ట్రపతి అన్నారు.
1918లో మహాత్మాగాంధీ మద్రాసులో దక్షిణ్‌ భారత్‌ హిందీ ప్రచార్‌సభను స్థాపించి మరణించేవరకూ అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తుచేశారు. 1935లో హైదరాబాద్‌లోనూ గాంధీజీ హిందీ ప్రచార్‌సభను స్థాపించిన విషయాన్ని కూడా రాష్ట్రపతి గుర్తుచేశారు. భిన్న భాషలను మాట్లాడే భారత్‌ వంటి పరిస్థితులు ఏ దేశంలోనూ లేవని, అందుకే హిందీతోపాటుగా ఇతర భాషలకు కూడా సమాన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ శ్రీహరివంశ్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు కె.కే శవ రావు, సంతోష్‌కుమార్‌, సుజనాచౌదరి, సత్యనారాయణ జటియా, ప్రొఫెసర్‌ మనోజ్‌ఝా, రవిశంకర్‌వర్మ, హుస్సేని దల్వాయ్‌, సెక్రటరీ జనరల్‌ దేశ్‌ దీపక్‌వర్మతోపాటుగా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *