Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వాయుగుండం ప్రభావంతో చురుగ్గా నైరుతి

వాయుగుండం ప్రభావంతో చురుగ్గా నైరుతి

అమరావతి:  పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. అలాగే ఆగ్నే య అరేబియా సముద్రాన్ని అనుకుని తూర్పు మధ్య ప్రాంతాల్లో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్‌ 1వ తేదీనే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి కోస్తాలో పలుచోట్ల వాతావరణ అనిశ్చితి ఏర్పడి క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించాయి. దీంతో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి.

Check Also

ఏపీలో కొత్తగా 1608 కేసులు

Share this on WhatsAppఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *