Breaking News
Home / National / పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు….

పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు….

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు వీలుగా ఉగ్రవాదులను సరిహద్దులు దాటించేందుకు పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) రెక్కీ నిర్వహించిందని వెల్లడైంది. చలికాలంలో పాక్ సరిహద్దుల్లో మంచు కురుస్తుండటంతో ఇదే అదనుగా చేసుకొని గైడ్స్ సాయంతో జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు కొత్త మార్గాలను అన్వేషించాలని ఐఎస్ఐ గైడ్స్‌ను కోరిందని భారత నిఘావర్గాలకు సమాచారం వచ్చింది. ఐఎస్ఐ గైడ్స్ సహకారంతో గురేజ్ సెక్టారులో జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటుకు రెక్కీ జరిపారని భారత ఇంటలిజెన్స్ కు అందిన సమాచారంతో భారత సాయుధ దళాలు అప్రమత్తమయ్యాయి.

సరిహద్దుల్లో సైనిక శిబిరాల జీపీఎస్ లొకేషన్లను గుర్తించి వారి బారిన పడకుండా కొత్త మార్గాల్లో జమ్మూలోకి ప్రవేశించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మ్యాప్ లు సిద్ధం చేసుకున్నారని భారత నిఘావర్గాలకు సమాచారం అందింది. పాక్ నుంచి నియంత్రణ రేఖ దాటి సరిహద్దు గ్రామాల్లోకి చొరబడి అక్కడి ఇళ్లలో ఆశ్రయం తీసుకునేందుకు పాక్ పథకం రూపొందించింది. గురేజ్ సెక్టారు ఆవల పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పాకిస్థాన్ అదనపు సైనికదళాలు సంచరిస్తున్నాయని మన నిఘావర్గాలకు సమాచారం అందింది. పాక్ సరిహద్దుల్లోని మీనీమార్గ్, కమ్రీ, దొమ్మేల్, గుల్టారీ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ పోస్టులతోపాటు ఉగ్రవాద శిబిరాలున్నాయి. గిల్జిత్, చిల్లాం శిబిరాల నుంచి పెద్దఎత్తున తుపాకులు, మందుగుండు సామాగ్రిని సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలకు తరలించారు. దీంతో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *