Breaking News
Home / States / మెదక్ జిల్లాలో ఉద్రిక్తత…

మెదక్ జిల్లాలో ఉద్రిక్తత…

మెదక్‌ : మెదక్‌ పట్టణంలోని గురుకుల పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కావ్య అనే విద్యార్థి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో కావ్య కుటుంబసభ్యులు మృతదేహంతో పాఠశాలకు ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. దీంతో ఈ ఏరియాలో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. గత నెల రోజులుగా కావ్య డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నరెసిడెన్షియల్‌​ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించలేదని పేర్కొన్నారు. దీనికి పాఠశాల ప్రిన్సిపాల్‌ బాధ్యత వహించాలని, ఆమె నిర్లక్ష్యం కారణంగానే కావ్య మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *