Breaking News
Home / States / Andhra Pradesh / మహారాజా కాలేజీ వద్ద ఉద్రిక్తత…

మహారాజా కాలేజీ వద్ద ఉద్రిక్తత…

విజయనగరం : విజయనగరం మహారాజా (ఎంఆర్‌) కాలేజీలో గురువారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులకు రావల్సిన పెండింగ్‌ స్కాలర్‌షిప్, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించాలని కోరుతూ… ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్‌ ముట్టడికి, భారీ ధర్నాకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో.. కాలేజీలో ఉన్న విద్యార్థులను బయటకు రానీయకుండా పోలీసులు కాలేజీ గేట్లను మూసేశారు. తమను బైటకు వదలాలంటూ.. విద్యార్థులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులను కాలేజీలో నుండి బైటకి వదలాలంటూ.. కాలేజీ గేటు బయట ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా చేపట్టింది. ఈ నేపథ్యంలో.. పలువురు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *