Breaking News
Home / National / చెన్నైలో సిఏఏ వ్యతిరేక నిరసనల్లో ఉద్రిక్తత…

చెన్నైలో సిఏఏ వ్యతిరేక నిరసనల్లో ఉద్రిక్తత…

చెన్నై : చెన్నైలోని పాత వాషర్‌మేన్ పేట ప్రాంతంలో  దాదాపు 5 వేల మంది సిఏఏ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వచ్చారు. ఆ ప్రాంతంలోని మింట్ బ్రిడ్జిని నిరసనకారుల సమూహం పూర్తిగా మూసివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిరసనకారుల సమూహాన్ని నియంత్రించేందుకు వేయి మంది పోలీసుల బృందం రంగంలోకి దిగి లాఠీచార్జి చేసింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరగడంతో 170 మంది నిరసనకారులని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిరసనకారులతో చెన్నై సిటీ పోలీసు కమీషనర్ చర్చలు జరిపి పరిస్థితిని అదుపు చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *