Breaking News
Home / National / మరోసారి గ్రెనెడ్ దాడి చేసిన ఉగ్రవాదులు…

మరోసారి గ్రెనెడ్ దాడి చేసిన ఉగ్రవాదులు…

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాష్ట్ర పరిధిలోని అనంత్‌నాగ్ నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ కార్యాలయ భవనం వద్ద గుర్తుతెలియని ఉగ్రవాదులు మరో సారి గ్రెనెడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడి ఉంటారని భావిస్తున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండోసారి. గత నెల 28వ తేదీన శ్రీనగర్ పట్టణంలో ఉగ్రవాదులు గ్రెనెడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి సీఆర్‌పీఎఫ్ జవాన్లు బయటపడ్డారు. సీఆర్‌పీఎఫ్ 38వ బెటాలియన్ కు చెందిన జవాన్లు నవా కదల్ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉండగా గ్రెనెడ్ పేలింది. అదే రోజు ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ-కిష్టావార్ జాతీయ రహదారిపై జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ మరణించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *