Breaking News
Home / National / ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలపై గురిపెట్టిన ఉగ్రవాదులు….

ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలపై గురిపెట్టిన ఉగ్రవాదులు….

ఢిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం, అగ్రనేతలపై దాడికి ఉగ్రవాదులు గురిపెట్టినట్లు నిఘావర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదులు ఇప్పటికే పీవోకే ద్వారా చొరబడినట్లు సమాచారం.

తాజా ఘటనల నేపథ్యంలో ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. కేంద్ర నిఘా సంస్థ హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ఎన్‌ఐఏ కార్యాలయం, సీజీవో కాంప్లెక్స్‌, ఎన్‌ఎస్‌జీ, సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయాలపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు నిఘావర్గాలు తెలిపాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని ఆయా విభాగాలను కేంద్ర హోంశాఖ హెచ్చరించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *