Breaking News
Home / National / హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు : బీజేపీ నేత కపిల్ మిశ్రా

హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు : బీజేపీ నేత కపిల్ మిశ్రా

న్యూఢిల్లీ: దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రేపిస్టులతో వ్యవహరించడం ఎలాగో తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకోవాలంటూ ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దిశ కేసు నిందితుల ఎన్‌‌కౌంటర్‌పై ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు. రేపిస్టులతో ఇలాగే వ్యవహరించాలి. మిగతా రాష్ట్రాల పోలీసులు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను….’’ అని వ్యాఖ్యానించారు. నిందితుల ఎన్‌కౌంటర్‌కి సంబంధించిన ఓ వార్తను కూడా ఆయన తన పోస్టుకు జతచేశారు. ఆమాద్మీ పార్టీ ప్రభుత్వంలో గతంలో ఢిల్లీ మంత్రిగా పనిచేసిన కపిల్ మిశ్రా… ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *