Breaking News
Home / National / ఆ బిల్లును ఉపసంహరించుకోవాలి…

ఆ బిల్లును ఉపసంహరించుకోవాలి…

ఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎంపీ కేశవ రావు బిల్లుపై మాట్లాడారు. అస్సాం ప్రజలు ఎందుకు భయపడుతున్నారో అర్థం చేసుకోగలరా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. తాము ఈ దేశంలో పౌరులం కామేమో అన్న భయంతో కొందరు ఉన్నారని ఎంపీ కేశవరావు అభిప్రాయపడ్డారు. మతపరంగా మైనార్టీలుగా ఉన్నవారిని రక్షించుకోవాలన్నారు. కానీ ఏ ఒక్క వర్గాన్ని కూడా వెలివేయకూడదన్నారు. బిల్లుపై రెండవ అభిప్రాయం వద్దు అని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంపీ కేశవరావు తెలిపారు. మతం ఆధారంగా దేశ విభజన జరిగిందన్న ఆలోచనను తాను నమ్మడం లేదన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు .. భారతీయ భావాన్ని సవాల్ చేస్తుందని టీఆర్ఎస్ ఎంపీ తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *