Breaking News
Home / States / Andhra Pradesh / ఆ రోజే.. అడ్డంగా బుక్కయ్యారు!

ఆ రోజే.. అడ్డంగా బుక్కయ్యారు!

కర్నూలు: ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం రోజే కర్నూలు సబ్‌ రిజిస్ట్రార్‌ షేక్‌ మహబూబ్‌ అలీ అడ్డంగా బుక్కయ్యారు. ప్రైవేట్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించుకుని చేస్తున్న దందాను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బట్టబయలు చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ను అరెస్టు చేశారు. అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 14400కు బాధితుడి ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ ఈ దాడి చేయడం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ పి.నాగభూషణం తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు నగరానికి చెందిన పి.జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక పాతబస్టాండ్‌లో హిమాలయ మెడికల్‌ షాపు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. షాపు లీజు డీడ్‌కు సంబంధించి అన్ని దరఖాస్తులను సబ్‌ రిజిస్ట్రార్‌ మహబూబ్‌ అలీకి సమర్పించారు. లీజు డీడ్‌ కావాలంటే రూ.8 వేలు లంచం ఇవ్వాలని మొదట ఆయన డిమాండ్‌ చేశారు.లంచం ఇవ్వడం ఇష్టంలేక బాధితుడు అవినీతి నిరోధక టోల్‌ ఫ్రీ నంబర్‌ 14400కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును నమోదు చేసుకున్న కాల్‌ సెంటర్‌ సిబ్బంది ఈ విషయాన్ని కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణానికి తెలియజేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *