Breaking News
Home / Film News / మహేష్ ఫ్యాన్స్‌కు ఆ చిత్రయూనిట్ ట్రీట్….

మహేష్ ఫ్యాన్స్‌కు ఆ చిత్రయూనిట్ ట్రీట్….

ఫిల్మ్ న్యూస్: ఈ ఏడాది సంక్రాంతికి `ఎఫ్2`వంటి భారీ విజయాన్ని అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చే ఏడాది సంక్రాంతికి మరో భారీ సినిమాతో సిద్ధమవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ లోపు దీపావళి సందర్భంగా మహేష్ ఫ్యాన్స్‌కు చిత్రయూనిట్ ట్రీట్ ఇవ్వబోతోంది.

ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. `విలన్ హౌస్ షెడ్యూల్ పూర్తయింది. `సరిలేరు నీకెవ్వరు` నుంచి దీపావళి ట్రీట్‌కు సిద్ధంగా ఉండండ`ని ట్వీట్ చేశారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *