Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / అందుకే ‘చౌకీదార్’ అంటే చంద్రబాబుకి భయం: మోదీ

అందుకే ‘చౌకీదార్’ అంటే చంద్రబాబుకి భయం: మోదీ

అమరావతి: అమరావతి నుంచి పోలవరం దాకా చేపట్టిన ప్రాజెక్టుల్లో చంద్రబాబు ఏం చేశారో ఆయనకు బాగా తెలుసునని, అందుకే మోదీ అనే చౌకీదార్ (సేవకుడు) పేరు చెబితే ఆయనకు భయమేస్తోందని మోదీ ఎద్దేవా చేశారు.

సొంత సంపదను పెంచుకోవడానికి జనం నేతల్ని ఎన్నుకోలేదని, దేశ సంపదను పెంచడానికి ఎన్నుకున్నారని, చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని మోదీ అన్నారు. ‘‘నన్ను తిట్టడం సరే, ముందు ఏపీ నిలదీస్తుంది. చంద్రబాబూ.. సమాధానం చెప్పండి. మీరు ఖర్చు చేస్తున్న సొమ్ము ఎవరిది. జనం సొమ్మును నీళ్లలా ఖర్చు పెడతారా?’’ అని చంద్రబాబును మోదీ ప్రశ్నించారు. పదేపదే చంద్రబాబు చెప్తున్న అబద్ధాలు చూస్తే జనంలో ఆయన విశ్వాసం కోల్పోయారని అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఓడిపోవడం ఖాయమైపోయిందని మోదీ ఉద్ఘాటించారు.

Check Also

మాదాపూర్‌ లేడీస్ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య

Share this on WhatsAppహైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *