Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / ఆ పార్టీ డబ్బులు కోసమే పనిచేస్తోంది…

ఆ పార్టీ డబ్బులు కోసమే పనిచేస్తోంది…

అనంతపురం: జనవరి 2వతేదీ నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తామని, ప్రజాసమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జె.సీ.ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయారం-గాయారంలు పార్టీలోకి వస్తుంటారు.. పోతుంటారని, వారితో టీడీపీకి ఒరిగేదేమీ లేదని అన్నారు. వారు ఉనికిని కాపాడుకోవడం కోసమే పార్టీలు మారుతూ పబ్బం గడుపుకుంటారని విమర్శించారు. తాను ఎవరికీ భయపడనన్నారు. తాడిపత్రిలో వైసీపీ పార్టీ డబ్బులు కోసమే పనిచేస్తోందని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *