Breaking News
Home / National / ఈ-సిగరెట్లను అందుకే బ్యాన్ చేశాం: ప్రధాని మోదీ

ఈ-సిగరెట్లను అందుకే బ్యాన్ చేశాం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఈ-సిగరెట్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో తొలిసారిగా స్పందించారు. ఈ-సిగరెట్లు హానికరం కావనే అపోహ యువతలో ఉందని, కానీ నికోటిన్ ఏ రూపంలో తీసుకున్నా హానికరమేనని ఆయన వ్యాఖ్యానించారు.

“సిగరెట్లు హానికరమని మనందిరికీ తెలిసిందే. ఈ వ్యసనం బారిన పడిన తరువాత..దీన్ని వదిలించుకోవడం కూడా కష్టమే. పొగాకులో ఉండే నికోటిన్ కారణంగా మనుషులు సిగరెట్లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా యువత మానసిక ఎదుగుదలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పోగాకు ఉత్పత్తులను తీసుకునేవారు క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం, వంటి అనేక వ్యాధుల బారినపడుతున్నారు.నికోటిన్ ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమే” అని ప్రధాని అన్నారు. ఈ-సిగరెట్లు హానికరం కావు అనే అపోహే యువతను వాటికి అలవాటు పడేలా చేస్తోందన్నారు.

“యువతకు వీటిపై పూర్తి అవగాహన లేదు. దీంతో అసలు ఇవేంటో తెలసుకోవాలనే కుతూహలం క్రమంగా వ్యసనానికి దారితీస్తోంది. కొంత మంది పిల్లలు ఇదేదో మ్యాజిక్ ట్రిక్ అనుకుంటున్నారు. తమ స్నేహితుల ముందు గొప్పగా ప్రదర్శించాలనుకుంటున్నారు. అవగాహ లేమి కారణంగా కుటుంబంలోని పెద్దలు కూడా ఒక్కోసారి పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో పిల్లలు క్రమంగా ఈ-సిగరెట్లకు బానిసవుతున్నారు. అందుకే ఈ సిగరెట్లను, ఇతర పొగాకు ఉత్పత్తులను విడనాడాలని నేను మీ అందర్నీ కోరుతున్నాను. వీటి విషయంలో ఎటువంటి అపోహలకూ లోనుకాకండి. రండి..మనమందరం కలిసి ఆర్యోగవంతమైన భారత్‌ను నిర్మిద్దాం.” అని ప్రధాని నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు.న్యూఢిల్లీ: ఈ-సిగరెట్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో తొలిసారిగా స్పందించారు. ఈ-సిగరెట్లు హానికరం కావనే అపోహ యువతలో ఉందని, కానీ నికోటిన్ ఏ రూపంలో తీసుకున్నా హానికరమేనని ఆయన వ్యాఖ్యానించారు.

“సిగరెట్లు హానికరమని మనందిరికీ తెలిసిందే. ఈ వ్యసనం బారిన పడిన తరువాత..దీన్ని వదిలించుకోవడం కూడా కష్టమే. పొగాకులో ఉండే నికోటిన్ కారణంగా మనుషులు సిగరెట్లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా యువత మానసిక ఎదుగుదలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పోగాకు ఉత్పత్తులను తీసుకునేవారు క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం, వంటి అనేక వ్యాధుల బారినపడుతున్నారు.నికోటిన్ ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమే” అని ప్రధాని అన్నారు. ఈ-సిగరెట్లు హానికరం కావు అనే అపోహే యువతను వాటికి అలవాటు పడేలా చేస్తోందన్నారు.

“యువతకు వీటిపై పూర్తి అవగాహన లేదు. దీంతో అసలు ఇవేంటో తెలసుకోవాలనే కుతూహలం క్రమంగా వ్యసనానికి దారితీస్తోంది. కొంత మంది పిల్లలు ఇదేదో మ్యాజిక్ ట్రిక్ అనుకుంటున్నారు. తమ స్నేహితుల ముందు గొప్పగా ప్రదర్శించాలనుకుంటున్నారు. అవగాహ లేమి కారణంగా కుటుంబంలోని పెద్దలు కూడా ఒక్కోసారి పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో పిల్లలు క్రమంగా ఈ-సిగరెట్లకు బానిసవుతున్నారు. అందుకే ఈ సిగరెట్లను, ఇతర పొగాకు ఉత్పత్తులను విడనాడాలని నేను మీ అందర్నీ కోరుతున్నాను. వీటి విషయంలో ఎటువంటి అపోహలకూ లోనుకాకండి. రండి..మనమందరం కలిసి ఆర్యోగవంతమైన భారత్‌ను నిర్మిద్దాం.” అని ప్రధాని నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *