Breaking News
Home / States / ‘దిశ’ నిందితుల దురాగతాన్ని వివరించిన సీపీ…

‘దిశ’ నిందితుల దురాగతాన్ని వివరించిన సీపీ…

హైదరాబాద్: ‘దిశ’ నిందితులు కరుడగట్టిన నేరస్తులు అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్నాక ఈనెల 4, 5 తేదీల్లో నిందితులను విచారించామని చెప్పారు. చాలా విషయాలు నిందితులు చెప్పినట్లు వెల్లడించారు. బాధితురాలి సెల్‌ఫోన్, వస్తువులు దాచిపెట్టినట్లు వారు చెప్పారన్నారు. నిందితులు చెప్పిన దాని ప్రకారం తెల్లవారుజామున పోలీసులు నిందితులను ఘటనా స్థలానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. అక్కడ నిందితులంతా పోలీసులపై రాళ్లు రువ్వారన్నారు. అలాగే రాళ్లు, కర్రలతో దాడి చేశారని చెప్పారు.

అంతేకాకుండా పోలీసుల దగ్గర ఉన్న రెండు వెపన్లు తీసుకొని ఫైర్ స్టార్ట్ చేశారన్నారు. సరెండర్‌ కావాలని కోరినా వినలేదని వెల్లడించారు. అందువల్లే పోలీసులు కూడా నిందితులపై ఫైరింగ్‌ స్టార్ట్‌ చేశారని పేర్కొన్నారు. ఈ ఉదయం 5.45 గంటల నుంచి 6.15 గంటల మధ్య కాల్పులు జరిగాయన్నారు. ఆరిఫ్‌, చెన్నకేశవులు దగ్గర రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ తలకు గాయాలయ్యాయని స్పష్టం చేశారు. గాయపడ్డ పోలీసులను కేర్‌ ఆస్పత్రికి తరలించామన్నారు. మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామని… ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం జరగనుందని వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలకు అప్పగిస్తామన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *