Breaking News
Home / Film News / నటిగా తనదైన ముద్ర వేశారు: బాలకృష్ణ

నటిగా తనదైన ముద్ర వేశారు: బాలకృష్ణ

ఫిల్మ్ న్యూస్: నటి గీతాంజలి మృతిపై నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ గీతాంజలిగారు మరణించారనే వార్త తెలియగానే షాక్ అయ్యానన్నారు. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారని, మా కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న వారిలో ఆవిడ ఒకరని అన్నారు. నాన్నగారంటే ఆవిడకు ఎంతో అభిమానమని, నాన్నగారు డైరెక్ట్ చేసిన `సీతారామకళ్యాణం` సినిమాలో సీత పాత్రలో గీతాంజలిగారు నటించారని గుర్తు చేశారు. నటనలో ఆవిడ నాన్నగారిని ఎప్పుడూ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేవారని, తెలుగు సినిమాల్లో నటిగా తనదైన ముద్ర వేశారని, అలాంటి గొప్ప నటి మనల్ని విడిచిపెట్టి పోవడం ఎంతో బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *