ఫిల్మ్ న్యూస్: దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ కియారా అద్వానీ. మరోవైపు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తూ ప్రేక్షకులకు చేరవవుతోంది. ఇటీవల సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ లీగ్‌లోకి అడుగుపెట్టింది. కియరా ప్రస్తుతం హిందీలో ‘లక్ష్మీబాంబ్’, ‘ఇందూకీ జవానీ’ చిత్రాల్లో నటిస్తోంది.
‘ఇందూకీ జవానీ’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కియార తన కెరీర్ గురించి మాట్లాడింది. ‘హీరోయిన్గా నా కెరీర్ చాలా ఆసక్తికరంగా సాగింది. హిందీతోపాటు పలు భాషల్లో నటించాను. వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించాను. ఇక్కడ అందం ఒకటే సరిపోదు. కేవలం అందం మీదే ఆధారపడిన హీరోయిన్లు కొద్దికాలమే ఉంటారు. అందంతోపాటు ప్రతిభ కూడా తోడైతే ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉంటార’ని కియార చెప్పింది.