Breaking News
Home / National / పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో నైజేరియా దేశస్థుడి అరెస్ట్

పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో నైజేరియా దేశస్థుడి అరెస్ట్

పానీటాంకీ (పశ్చిమబెంగాల్): ఎలాంటి పాస్‌పోర్టు లేకుండా అక్రమంగా పశ్చిమబెంగాల్ మీదుగా నేపాల్ దేశానికి వెళుతున్న ఓ నైజేరియా దేశస్థుడిని భద్రతాదళం పట్టుకొని పశ్చిమబెంగాల్ పోలీసులకు అప్పగించింది. నైజేరియా దేశానికి చెందిన స్టీఫెన్ జోహాథన్ అనే వ్యక్తి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పానీటాంకీ అవుట్ పోస్టు వద్ద సరిహద్దులు దాడి నేపాల్ దేశంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా భద్రతాదళం పట్టుకుంది. అనంతరం భద్రతాదళం జవాన్లు స్టీఫెన్ ను ఖరీబరీ పోలీసులకు అప్పగించారు. స్టీఫెన్ తమిళనాడు రాష్ట్రానికి వచ్చి వీసా గడవు ముగిశాక కూడా భారతదేశంలోనే నివాసముండటంతో అతన్ని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారని తేలింది. స్టీఫెన్ పాస్ పోర్టును తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పశ్చిమబెంగాల్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతనికి పదివేల రూపాయల జరిమానా కూడా విధించారు. భారతదేశం విడిచి వెళ్లాలంటే స్టీఫెన్ తమిళనాడు అధికారులను సంప్రదించాలని పశ్చిమబెంగాల్ పోలీసులు కోరారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *