Breaking News
Home / Film News / మంచు ఫ్యామిలీ నుండి మరో నిర్మాత….

మంచు ఫ్యామిలీ నుండి మరో నిర్మాత….

ఫిల్మ్ న్యూస్: విలక్షణ నటుడు మోహన్‌బాబు వారసుడు మంచు మనోజ్‌ చలాకితనానికి ఆయన కెరీర్‌ ఉజ్వలంగా ఉంటుందని అంతా భావించారు. చాలా సహజంగా నటించే మనోజ్‌ నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ పేరు తెచ్చుకున్నాడు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలను దాటేశాడు. ఇటీవలే తన భార్య నుండి విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాలను బహిరంగంగానే తెలియజేశారు. ఆ తర్వాత తన కొత్త జర్నీ మొదలు పెడతాను అని చెప్పారు. కొత్త జర్నీలో తొలుత తీసుకున్న నిర్ణయం సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. నిర్మాతగా మారుతున్నారు. ఎం.ఎం. ఆర్ట్స్‌ పేరుతో సంస్థను రిజిస్ట్రేషన్‌ చేశారు. దీనిపై సినిమాలు తీస్తానని, కొత్తవారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తానని ట్వీట్‌ చేశారు. మోహన్‌ బాబు ఇంట్లో ఇప్పటికే మూడు నిర్మాణ సంస్థలున్నాయి. తాజాగా నాలుగవది. పిల్లలు పెద్దవాళ్ళు కావడంతో వారి అభిరుచికి అనుగుణంగా తీసుకునేందుకు సొంతంగా బేనర్లు నెలకొల్పుతున్నట్టుగా భావించాలి.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *