Breaking News
Home / hyderabad / నేడు ఘంటసాల పురస్కారాల ప్రదానం

నేడు ఘంటసాల పురస్కారాల ప్రదానం

ఆబిడ్స్‌ : ప్రముఖ అమర గాయకుడు ఘంటసాల జయంతిని పురస్కరించుకుని శృతిలయ అకాడమీ – సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పురస్కారాల ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు బండారు సుబ్బారావు, డాక్టర్‌ బి.భీంరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రవీంద్రభారతి వేదికగా సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని ఆమని నేతృత్వంలో ఘంటసాల స్వర వైభవం – సినీ సంగీత విభావరి నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌, తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామెదర్‌గుప్తా, యువ కళావాహిని అధ్యక్షుడు వైకే నాగేశ్వరరావు తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

 

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *