Breaking News
Home / National / గవర్నర్ కు చేదు అనుభవం..

గవర్నర్ కు చేదు అనుభవం..

పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ జగదీప్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య వివాదం తార స్థాయికి చేరింది. ఈరోజు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీకి వచ్చిన ఆయన కాన్వాయ్ గేట్ నెంబర్ వన్ గుండా లోపలకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆ గేటుకు తాళం వేయడంతో ఆయన షాక్ కు గురయ్యారు. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం గేట్ నెంబర్ 2 నుంచి నడుచుకుంటూ లోపలకు వెళ్లారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారంటూ మమతా బెనర్జీ ఇటీవలి కాలంలో గవర్నర్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *