Breaking News
Home / National / కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నాలతో అప్రత్తమవుతున్న బీజేపీ

కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నాలతో అప్రత్తమవుతున్న బీజేపీ

కర్ణాటక: అసెంబ్లీలో బుధవారం బలపరీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రతిపాదించడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబల్ ఎమ్మెల్యే నాగరాజు ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్..రాజీనామాను వెనక్కి తీసుకునేలా ఆయనను ఒప్పించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం బలం పుంజుకోకుండా బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. కర్ణాటక సీఎం కుమారస్వామి తన బలాన్ని అసెంబ్లీలో సోమవారం నిరూపించుకోవాలని బీజేపీనేత, మాజీ సీఎం యడ్యూరప్ప డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు నగేష్, శంకర్.. స్పీకర్ రమేష్ కుమార్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. శాసనసభలో ప్రతిపక్షంవైపు తమ స్థానాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 26వరకు కొనసాగనున్నాయి. కుమారస్వామి కేబినెట్‌లో నగేష్ చిన్నతరహా పరిశ్రమల మంత్రిగా, శంకర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటీవల నియమితులయ్యారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే మద్దతు ఇస్తామని ప్రకటించారు.

Check Also

ఢిల్లీ మాజీ సిఎం అంత్యక్రియల ఖర్చు ఎంతో తెలుసా?

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం నిగంబాధ్‌ ఘాట్‌లో జరిగాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *