Breaking News
Home / National / మాజీ బీజేపీ నేతకు కాంగ్రెస్ పార్టీ తీర్థం

మాజీ బీజేపీ నేతకు కాంగ్రెస్ పార్టీ తీర్థం

న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్, మూడుసార్లు దర్బంగా ఎంపీ అయిన మాజీ బీజేపీ నాయకుడు కీర్తిఆజాద్ కాంగ్రెస్ పార్టీ తీర్థం స్వీకరించనున్నారు. ఈ నెల 15వతేదీన సీనియర్ కాంగ్రెస్ నేతల సమక్షంలో ఈ నెల 15వతేదీన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు కీర్తి ఆజాద్ ప్రకటించారు. దర్బాంగా ఎంపీ అయిన కీర్తి ఆజాత్ 2015లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బీజేపీ పార్టీ నుంచి అతన్ని బహిష్కరించింది. సీట్ల సర్దుబాటులో భాగంగా దర్బంగా సీటును ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీకి వదిలివేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. బీహార్ రాష్ట్రంలో ఆర్జేడీ పార్టీతో సీట్ల సర్దుబాటు చర్చలు జరిపేందుకు బీహార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా, సీఎల్పీ నాయకుడు సదానంద్ సింగ్, ఎంపీ అఖిలేష్ సింగ్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని కలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Check Also

రాజకీయాలకతీతంగా దాడిని ఖండించాం: రామ్మోహన్‌నాయుడు

Share this on WhatsAppన్యూఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వివరించారని టీడీపీ ఎంపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *