Breaking News
Home / States / Andhra Pradesh / ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదు: విష్ణుకుమార్‌రాజు

ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదు: విష్ణుకుమార్‌రాజు

విశాఖ: ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదని, ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చెప్పారు. వ్యక్తిగత కారణాలతో కొందరు బీజేపీని వీడారని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి పోటీ చేసేది కోడ్ వచ్చాక చెప్తానన్నారు. కొందరు టీడీపీ నేతలు ఇసుక ర్యాంపుల్లో దోచుకుంటున్నారని విష్ణకుమార్‌రాజు ఆరోపించారు.

సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో బీజేపీకి వలసల కష్టాలు ఎదురవుతున్నాయి. బీజేపీకి బైబై చెప్పిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బాటలోనే మరికొందరు నడుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో విష్ణుకుమార్‌రాజుతోపాటు మరో ముగ్గురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక ప్రధాన పార్టీ నుంచి బీజేపీలో చేరిన ముఖ్యమైన మహిళా నాయకురాలు కూడా కమలానికి గుడ్‌బై చెబుతారని తెలుస్తోంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు రీత్యా ఆమె వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తన కుమారుడికి ఎమ్మెల్యే, తనకు ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. కుమారుడికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా… ఆమెకు ఎంపీ టికెట్‌పై స్పష్టత రాలేదని తెలుస్తోంది. రాయలసీమ జిల్లాలకు చెందిన మరో కీలక నేత చల్లాపల్లి నరసింహారెడ్డి సైతం పార్టీలో అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

Check Also

రాజధాని అమరావతిని మార్చకుండా చూడాలి…

Share this on WhatsAppగుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మార్చేస్తారంటూ పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతరైతులు బీజేపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *