Breaking News
Home / National / పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన ప్రధాని సోదరుడు

పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన ప్రధాని సోదరుడు

జైపూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ధర్నాకు దిగారు. తన కేటాయించిన సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించారు.

జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రహ్లాద్ మోదీ జైపూర్ నుంచి అజ్మీర్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రక్షణగా ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లను నియమించారు. రూల్ ప్రకారం సెక్యూరిటీ సిబ్బంది సంబంధిత వ్యక్తి వాహనంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ప్రహ్లాద్ మోదీ అందుకు నిరాకరించారు. సెక్యూరిటీ అధికారులు తన వాహనంలో వచ్చేందుకు ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ అధికారులకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై గల బగ్రు పోలీస్ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. దాదాపు గంటపాటు అలాగే నిరసన వ్యక్తం చేశారు. ఆ తరువాత ఉన్నతాధికారలు వచ్చి ఆయనకు సర్ది చెప్పడంతో చివరకు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని తన వాహనంలో ఎక్కించుకునేందుకు అంగీకరించారు.

Check Also

రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Share this on WhatsAppరానున్న 24 గంటల్లో ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్, పౌరీ, నైనతాల్ జిల్లాలో భారీ నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *