Breaking News
Home / States / హత్యకు దారితీసిన మందుబాబుల ఘర్షణ….

హత్యకు దారితీసిన మందుబాబుల ఘర్షణ….

మట్టెవా: వరంగల్‌ అర్బన్‌ జిల్లా పాపయ్యపేట చమన్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ అల్లావుద్దీన్‌(35), ఎమ్‌డీ సందానీ, ఎండీ యాకూబ్‌లు కలిసి బుధవారం అర్ధరాత్రి వరంగల్‌ బీటు పాతబజార్‌లోని గౌడాబార్‌కు మద్యం తాగడానికి వెళ్లారు. వీరి పక్కనే వరంగల్‌ ఎల్‌బీ నగర్‌కు చెందిన ఏ. సోమేశ్వర్‌, శివనగర్‌కు చెందిన ఎండీ నజీర్‌, ముక్కెర శశికాంత్‌ మద్యం తాగుతున్నారు. సమయం ముగిసినప్పటికీ మద్యం సేవిస్తున్న ఈ ఇరు వర్గాలకు చెందిన యువకులను బార్‌ షాపు నిర్వాహకులు బయటకు వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ఓ వర్గం వారు మరో వర్గం వారిని మీరే ముందు బయటకు వెళ్లాలంటూ ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో బార్‌ షాపు కౌంటర్‌ వద్ద బీరు సీసాలతో ఇరు వర్గాల యువకులు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో అల్లావుద్దీన్‌ తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన యాకూబ్‌, సందానీని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడి పరారీలో ఉన్న సోమేశ్వర్‌, నజీర్‌, శశికాంత్‌ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను మట్టెవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *