Breaking News
Home / Crime / బీజేపీ కార్పొరేటర్ దారుణ హత్య….

బీజేపీ కార్పొరేటర్ దారుణ హత్య….

ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఓ బీజేపీ కార్పొరేటర్‌తో పాటు అతని కుటుంబంలోని నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. ఓ పక్క రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా మరోవైపు ఈ హత్య స్థానికంగా సంచలనం కలిగించింది. కార్పొరేటర్ రవీంద్రతో పాటు ఆయన కుటుంబ సభ్యులను దుండగులు నివాసంలోనే దారుణంగా కాల్చి చంపారు. నాటు తుపాకులు, కత్తులతో ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకులు బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ హత్యలు జరిగినట్టు అనుమానిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *