Breaking News
Home / Film News / బడ్జెట్ తక్కువ.. మైలేజ్ ఎక్కువ వచ్చే సినిమాకావాలట ఆ హీరోకు………

బడ్జెట్ తక్కువ.. మైలేజ్ ఎక్కువ వచ్చే సినిమాకావాలట ఆ హీరోకు………

తాకితే కాని మెగ్గరు.. తడిస్తే కాని కప్పరు అనేది ఓ మోటు సామెత. ఇప్పుడు ఈ సామెత ఆ హీరోకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. అందుకే ఆ హీరో ఇక ముందు ఏ సినిమా చేసిన ముందు వెనుకా ఆలోచించి చేయాలని నిర్ణయించుకున్నాడు. భవిష్యత్‌లో చేయబోయే సినిమాలు బడ్జెట్ తక్కువ.. మైలేజ్ ఎక్కువ వచ్చే సినిమాలే ప్లాన్ చేసుకుంటున్నాడని లోకం కోడై కూస్తుంది. అంతే కాదు.. ఏకంగా నిర్మాతలకు, దర్శకులకు తక్కువ బడ్జెట్ అయ్యే సినిమాలే తనకు తేవాలని చెప్పాడని సిని పరిశ్రమలో టాక్‌.

ఆకులు కాలాక చేతులు పట్టుకున్న చందంగా ఆ హీరో చావు దెబ్బ తిన్నతరువాత కళ్ళు తెరిచాడు. ఇంతకు ఏ హీరో గురించి ఇంతగా చెప్పుకుంటున్నామంటే.. ఆయనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌. సాహో చిత్రంతో ప్రభాస్ స్టామినా పెరిగింది.. కానీ సినిమా మాత్రం అప్పులు మిగిల్చింది. సాహో చిత్రం భారీ డిజాస్టర్ అయిన తరువాత జ్ఞానోదయం అయి.. ఇక చేయబోయే చిత్రాలు తక్కువ బడ్జెట్‌తో చేయాలని నిర్ణయించుకున్నారు..

సాహో చిత్రం ప్రభాస్‌కు బాలీవుడ్ మార్కెట్‌ను పెంచింది. ఆ మార్కెట్ ఇక భవిష్యత్‌లోనూ ఉంటుంది. అందుకే ఇక ముందు ఏ సినిమా తీసినా కూడా అది బాలీవుడ్ రేంజ్‌తో కథను తయారు చేసుకుని, బడ్జెట్ మాత్రం కేవలం రూ.100కోట్ల లోపే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సిని పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది. అంటే సాహో ఇచ్చిన షాక్ తో దిమ్మతిరిగిన ప్రభాస్ ఇకముందు భారీ బడ్జెట్ చిత్రాల జోలికి పోరని అర్థమయింది.. రాబోవు జాన్ చిత్రం కూడా తక్కువ బడ్జెట్‌తోనే రూపొందించే ప్రణాళిక వేసినట్లు చిత్ర యూనిట్ కథనం.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *