Breaking News
Home / States / చాకచక్యంతో వ్యవహరించిన డ్రైవర్…

చాకచక్యంతో వ్యవహరించిన డ్రైవర్…

హైదరాబాద్: వనస్థలిపురం సుష్మా చౌరస్తాలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న మినీ బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును అదుపు చేశాడు. బస్సు జనాలపైకి వెళ్లకుండా చాకచక్యంతో డివైడర్‌పైకి మళ్లించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు క్రేన్‌ సాయంతో బస్సును అక్కడ నుంచి తొలగించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *