Breaking News
Home / National / ప్రమాదవశాత్తూ నదిలో పడిన బస్సు…

ప్రమాదవశాత్తూ నదిలో పడిన బస్సు…

మధ్యప్రదేశ్: వేగంగా వస్తున్న బస్సు నదిలో పడి ఆరుగురు మరణించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైజెన్ జిల్లాలో జరిగింది. ఛతారాపూర్ నుంచి ఇండోర్ వస్తున్న బస్సు ప్రమాదవశాత్తూ నదిలో పడింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 19 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని భోపాల్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు నదిలో పడినపుడు అందులో 45మంది ప్రయాణికులున్నారని కలెక్టర్ చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మరణించిన వారిలో రెండేళ్ల వయసు గల బాలుడితోపాటు ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలను రెడ్ క్రాస్ ద్వార అందించామని కలెక్టర్ ఉమాశంకర్ చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని కలెక్టర్ పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *