మర్రిగూడ: నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం, యరుగండ్లపల్లి సమీపంలో ఓ కారు యాక్టివా బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పైనున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పైనున్న భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరికి కాళ్లు విరిగి, తీవ్ర రక్త స్రావమవగా.. వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
