Breaking News
Home / States / కాలువలోకి దూసుకెళ్లిన కారు….

కాలువలోకి దూసుకెళ్లిన కారు….

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. జగిత్యాల జిల్లా రాయకల్‌కు చెందిన ఓ కుటుంబం రాళ్లవాగు అందాలు చూసి తిరుగు ప్రయాణం అయ్యారు. వీరి వాహనం కమ్మర్‌పల్లి మండలం రాళ్లవాగు దగ్గరకు రాగానే అదుపు తప్పి పక్కనే ఉన్న నీటి గుంతలోకి దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే డోర్‌ ఓపెన్‌ చేసి.. అందులో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా కాపాడారు. ప్రమాద సమయంలో ముగ్గురు పిల్లలతోపాటు భార్య, భర్త కారులో ఉన్నారు. అనంతరం క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *