Breaking News
Home / National / చరిత్రలో నిలిచిపోతుంది:మోదీ

చరిత్రలో నిలిచిపోతుంది:మోదీ

పౌరసత్వ బిల్లు చరిత్రాత్మకం
ఎంపీల భేటీలో మోదీ ప్రకటన
న్యూఢిల్లీ: ‘పౌరసత్వ సవరణ బిల్లు’ సువర్ణాక్షరాలతో లిఖించినట్లుగా చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని మోదీ అన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దులాగే పౌరసత్వ సవరణకూడా చరిత్రాత్మకమని తెలిపారు. ఇంతటి ఘనమైన బిల్లుపై విపక్షాలు ‘పాకిస్థాన్‌ భాష’లో మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు. బుధవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈ అంశంపై తనదైన శైలిలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ‘‘మత వివక్ష, వేధింపులను భరించలేక భారత్‌లోకి వచ్చిన అనేక మంది ఇక్కడ అనిశ్చితి మధ్య బతుకుతున్నారు. పౌరసత్వంతో వారికి శాశ్వత ఉపశమనం లభిస్తుం ది. ఈ బిల్లు ఆమోదం పొందగానే సరిపోదు! ఎంపీలంతా జనంలోకి వెళ్లాలి. దీనిపై అనుమానాలు, అపోహలను పటాపంచలు చే యాలి. పౌరసత్వ సవరణ ఉద్దేశం గురించి ప్రజలకు వివరించాలి’’ అని బీజేపీ ఎంపీలను ఆదేశించారు. అలాగే.. రానున్న బడ్జెట్‌ ఎలా ఉండాలనే అంశంపైనా ప్రజాభిప్రా యం సేకరించాలన్నారు. ‘‘రైతులు, పేదలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు.. ఇలా అన్ని వర్గాల వారిని కలవండి. బడ్జెట్‌ ఎలా ఉండాలనుకుంటున్నారో తెలుసుకోండి. ఆ వివరాలు ఆర్థిక మంత్రికి తెలియచేయండి’’ అని ఎంపీలకు సూచించారు.

‘కర్ణాటక’ కోసం మరొక్కసారి..
బీజేపీ ఎంపీలంతా లేచి నిలుచుని, చప్పట్లు కొడుతూ ప్రధానికి స్వాగతం పలికారు. ‘‘కర్ణాటక ఉప ఎన్నికల్లో ప్రజలు మనకు ఘన విజయం కట్టబెట్టారు. వారికి ధన్యవాదాలు చెబుతూ మరొక్కసారి..’’ అంటూ మోదీ మరోసారి ఎంపీలతో చప్పట్లు కొట్టించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *