Breaking News
Home / National / తాజ్ మహల్ మూసివేత…

తాజ్ మహల్ మూసివేత…

ఆగ్రా: కరోనా వైరస్‌ దేశంలో విజృంభిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలకు ఉపక్రమించాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మార్చి 31వరకు దేశంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసిన విషయం తెలిసిందే. అన్ని థియేటర్లు, వ్యాయామశాలలు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, ఈత కొలనులు మూసేయాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో తాజ్‌ మహల్ సందర్శనను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. దేశంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో ఇప్పటి వరకు 137 కరోనా కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి.

 

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *