Breaking News
Home / National / అటువంటి దాడులు మరోసారి జరగకుండా….

అటువంటి దాడులు మరోసారి జరగకుండా….

ఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ‘నావెల్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌’లో పాల్గొన్న కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘భారత్‌ ఎప్పుడూ తప్పులు చేయలేదు. కావాలని ఏ దేశంపైనా దాడికి పాల్పడలేదు. పరాయి భూమిని కనీసం అంగుళం కూడా బలవంతంగా లాక్కోలేదు. కానీ, భారత్‌ను తప్పుడు దృష్టితో చూసేవారికి తగిన గుణపాఠం చెప్పే సామర్థ్యం మన సాయుధ బలగాలకు ఉంది. భారత నేవీ నిఘా నీడలో సముద్రమార్గం అత్యంత సురక్షితంగా ఉంది. ముంబయి దాడుల వంటి ఘటనలు మరోసారి జరగకుండా నావికాదళం చర్యలు తీసుకుంటోంది’ అని ఆయన చెప్పుకొచ్చారు.

2008 నవంబరు 26న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. సముద్ర మార్గం గుండా దేశంలోకి చొరబడిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయిలోని 12 చోట్ల వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *