Breaking News
Home / States / Andhra Pradesh / కూలిన వందేళ్లనాటి ధ్వజస్తంభం

కూలిన వందేళ్లనాటి ధ్వజస్తంభం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి
నెల్లూరు సాంస్కృతికం : నెల్లూరు నవాబుపేట శివాలయంలోని ధ్వజస్తంభం ఆదివారం వేకువజామున కూలిపోయింది. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవంతో ప్రమాదం తప్పినట్లయింది. కాగా, శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యే సమయంలో ధ్వజస్తంభం కూలడంతో భక్తులు కలత చెందారు. వెంటనే తాత్కాలిక ధ్వజస్తంభం ఏర్పాటు చేసి సంప్రోక్షణ, శాంతిపూజలు నిర్వహించినట్లు ఆలయ ఈవో నవీన్‌ తెలిపారు. ఈ శివాలయం సుమారు 250 ఏళ్లనాటిది. ధ్వజస్తంభం ప్రతిష్ఠించి వందేళ్లు దాటినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ ప్రాంగణంలోనే మరో ఆలయానికి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. కానీ అధికారులు గమనించకుండా పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *