Breaking News
Home / Lifestyle / Business / పేటీఎం శుభవార్త…పేటీఎం ఫస్ట్ కార్డు పేరుతో క్రెడిట్ కార్డు

పేటీఎం శుభవార్త…పేటీఎం ఫస్ట్ కార్డు పేరుతో క్రెడిట్ కార్డు

న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు భారత ఇ-కామర్స్ పేమెంట్ సిస్టమ్ అండ్ డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం శుభవార్త అందించింది. పేటీఎం ఫస్ట్ కార్డు పేరుతో క్రెడిట్ కార్డును విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. సిటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు పేటీఎం పేర్కొంది. సంవత్సరానికి క్రెడిట్ కార్డుపై ఫీజు రూ. 500 వసూలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే పేటీఎం ఫస్ట్ కార్డు ద్వారా సంవత్సరానికి రూ. 50,000 పైగా వాడుకున్న కస్టమర్లకు కార్డుపై వార్షిక ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది. వినియోగదారులు పేటీఎం యాప్ ద్వారా పేటీఎం ఫస్ట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

Check Also

పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులర్పించిన చంద్రబాబు

Share this on WhatsAppన్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *