Breaking News
Home / National / మోదీ వ్యాఖ్యలను బలంగా తిప్పికొట్టిన కాంగ్రెస్

మోదీ వ్యాఖ్యలను బలంగా తిప్పికొట్టిన కాంగ్రెస్

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలు బలహీన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ శనివారం మీడియాతో మాట్లాడుతూ రాబోయే లోక్‌సభ ఎన్నికలు నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరిగే పోరాటమని తెలిపారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో శనివారం ప్రధాని మోదీ మాట్లాడుతూ అవినీతి, బంధుప్రీతిని పెంచి, పోషించేందుకు బలహీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు జట్టుకడుతున్నాయన్నారు. కానీ బీజేపీ మాత్రం సర్వతోముఖాభివృద్ధి కోసం బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

Check Also

ఎంజీ హెక్టార్ కారు విడుదల

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఎంజీ మోటార్స్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మరో కారును మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *